చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం (India vs England 1st Test 2021) పాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో భారీ ఓటమి మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి(72), ఓపెనర్ శుభ్‌మన్ గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీం డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచారు.
తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించిన పంత్ సైతం 11 పరుగులకే (India vs England Highlights 1st Test 2021 Day 5) నిష్క్రమించాడు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారా సైతం 15 పరుగులకే అవుట్ అయి క్రీజును వీడాడు. ఈ నేపథ్యంలో వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది. రెండోఇన్నింగ్స్‌లో టీమ్ కేవలం 192 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఆరు వరసు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 4 వికెట్లతో భారత్ జట్టును స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీలతో శుభ్ మన్ గిల్, కెప్టెన్ కోహ్లీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెస్, బెన్ స్టోక్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇంగ్లండో తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా ఇండియా 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 337 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచారు. మొత్తం 420 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 192 పరుగులకే ఆలౌట్ అయింది.