IPL 2023: గెలుపు ఊపు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్, ఐపీఎల్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు భారీ జరిమానా

ఐపీఎల్‌-2023లో భాగంగా ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్‌ చేధించింది.

IPL 2023: గెలుపు ఊపు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్, ఐపీఎల్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు భారీ జరిమానా
(PIC @ IPL Twitter)

ఐపీఎల్‌-2023లో భాగంగా ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్‌ చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో జైశ్వాల్‌( 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్‌), శాంసన్‌(48 నాటౌట్‌) విధ్వంసం సృష్టించారు. అయితే రాజస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌కు బిగ్‌షాక్‌ తగిలింది.

బౌండరీ లైన్ వద్ద షిమ్రాన్ హెట్మేయర్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, సిక్స్ అనుకుని అలా చూస్తూ ఉండిపోయిన జాసన్ రాయ్

ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.బట్లర్‌ లెవెల్‌1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్‌ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఖాతా తెరవకుండానే బట్లర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

(The above story first appeared on LatestLY on May 12, 2023 02:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).