IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు

ఐపీఎల్‌-2023లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు
Chris Jordan

ఐపీఎల్‌-2023లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.అర్చర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జోర్డాన్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్‌ ఏమీ తీయకుండా 50 పరుగులిచ్చాడు. ముఖ్యంగా 18 ఓవర్‌ వేసిన జోర్డాన్‌కు లక్నో ఆల్‌రౌండర్‌ స్టోయినిష్‌ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు స్టోయినిష్‌ రాబట్టుకున్నాడు.

చెత్తగా ఆడాలని ఎవరూ కోరుకోరు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కన్నీటి పర్యంతమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్

దీంతో లక్నో 177 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌లు కలిపి 12 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ ఇంగ్లీష్ బౌలర్‌ .. ఏకంగా 132 పరుగులిచ్చాడు. ఇక చెత్త ప్రదర్శన కనబరుస్తున్న జోర్డాన్‌పై ముంబై ఫ్యాన్స్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదేమి చెత్త బౌలింగ్‌, ఇంతకమించి ఎవరూ దొరకలేదా? అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on May 17, 2023 09:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).