ఏడాది కాలంగా కెఎల్ రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న సంగతి విదితమే. దీనిపై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్ అనంతరం గాయపడిన కేఎల్ రాహుల్ టోర్నీకి దూరమయ్యాడు. లండన్‌లో రాహుల్‌కు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం కేఎల్ రాహుల్ ''ది రణ్‌వీర్ షో''లో మాట్లాడాడు.
పాకిస్తాన్‌తో ఎటువంటి సిరీస్ లు ఆడేది లేదు, స్పష్టం చేసిన బీసీసీఐ
"సోషల్ మీడియా ట్రోలింగ్ నాతోపాటు మరికొందరు ప్లేయర్స్ ను అప్పుడప్పుడూ ఆవేదనకు గురి చేస్తుంది. మాకు మద్దతు అవసరమైన సమయంలో అభిమానులు తాము ఏది కావాలంటే అనే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. మేమెవరమూ చెత్తగా ఆడాలని కోరుకోము. ఇదే మా జీవితం. మేము చేసేది ఇదే. నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదని ఆవేదనతో అన్నారు.
సౌరవ్ గంగూలీ భద్రతను Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
అయితే చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రెండు టెస్టులు ఆడిన రాహుల్.. వాటిలో విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్లో బాగానే ఆడినా.. అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడడం లేదు.