IPL 2023: కోహ్లి, గంభీర్‌ గొడవకు అసలు కారణం మహమ్మద్ సిరాజ్, గొడవ పెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న స్టార్ బౌలర్

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.

IPL 2023: కోహ్లి, గంభీర్‌ గొడవకు అసలు కారణం మహమ్మద్ సిరాజ్, గొడవ పెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న స్టార్ బౌలర్
Mohammed Siraj (Photo credit: Twitter)

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది. నవీన్‌ ఉల్‌ హక్‌ కారణంగా కోహ్లి, గంభీర్‌లు గొడవపడ్డారన్న సంగతి అందరికి తెలిసిందే.

మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం

వాస్తవానికి మ్యాచ్‌లో గొడవ ప్రారంభమైంది సిరాజ్‌తోనే. లక్నో బ్యాటింగ్‌ 17వ ఓవర్‌లో ఈ పోరు మొదలైంది. లక్నో 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేయడానికి మహ్మద్ సిరాజ్ వచ్చాడు. ఈ ఓవర్ తొలి 5 బంతుల్లో సిరాజ్ 8 పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఫ్రీ హిట్‌ అయింది. అయితే ఫ్రీ హిట్‌ను ఎదుర్కోవడంలో నవీన్ విఫలమవడంతో అది డాట్ బాల్ అయింది. తర్వాత సిరాజ్ బంతిని అందుకుని నవీన్ వైపు చూశాడు. అంతే కాకుండా నవీన్ క్రీజులో ఉన్నా.. బంతిని వికెట్‌కి విసిరాడు.

కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌

ఈ సందర్భంగా సిరాజ్-నవీన్ మధ్య స్వల్ప స్థాయిలో మాటల వాగ్వాదం జరిగింది. ఇక్కడే అసలు గొడవకు బీజం పడింది. ఆ తర్వాత కోహ్లీ జోక్యం చేసుకోవడంతో గొడవ పెద్దదైంది. మధ్యలో అమిత్ మిశ్రా వచ్చి కోహ్లీని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ, కోహ్లి.. మిశ్రాపై విరుచుకుపడ్డాడు.ఆ తర్వాత ఘటనను అంపైర్‌కు వివరిస్తుండగా కోహ్లీ సహనం కోల్పోయాడు. చివర్లో కోహ్లీ తన షూ డస్ట్‌ని నవీన్‌కి చూపించాడు. అనంతరం గంభీర్ ఎంటరయ్యాడు. సిరాజ్‌ సైడ్‌ అవ్వగా వీళ్లిద్దరి గొడవ ముదిరింది.

(The above story first appeared on LatestLY on May 03, 2023 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).