IPL 2023: కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే.

IPL 2023: కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌
Sunil Gavaskar (Photo Credits: Instagram)

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనపై క్రికెట్‌ దిగ్గజం​, భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఘాటుగా స్పందించాడు. కోహ్లి-గంభీర్‌లు జరిమానాలు విధిస్తే మారే రకం కాదని, వారిని తక్షణమే ఐపీఎల్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్వాహకులకు సూచించాడు.

మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం

కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైందని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలి కానీ, భారత క్రికెట్‌ పరువును ఇలా బజారుకీడ్చకూడదని హెచ్చరించాడు. జరిమానాలు విధించి సరిపెట్టుకుంటే వారి ఓవరాక్షన్‌ ఆగదని, కఠినమైన శిక్షలు వేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుందని అన్నాడు. కోట్లల్లో రెమ్యూనరేషన్‌ తీసుకునే కోహ్లి, గంభీర్‌లు ఫైన్‌లు అస్సలు లెక్క చేయరని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని వారి నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే లీగ్‌లో కొనసాగించాలని, అలా చేయకపోతే వారిని లీగ్‌ నుంచి బహిష్కరించాలని కోరాడు.

RCB Defeat Lucknow: లక్నోపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ, ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న బెంగళూరు, తొలిరౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీసేన 

రూల్స్‌ వ్యతిరేకించి, దేశ పరువును బజారుకీడ్చిన వారు ఎంతటి స్టార్‌ క్రికెటర్లైనా సహించకూడదని, కఠిన చర్చలు తీసుకుంటేనే మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో నవీన్‌ ఉల్‌ హాక్‌-కోహ్లిల గొడవను పర్సనల్‌గా తీసుకున్న గంభీర్‌ మ్యాచ్‌ అనంతరం కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.

(The above story first appeared on LatestLY on May 03, 2023 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).