Lucknow, May 02: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా 43వ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడ్డాయి. పదహారో సీజన్ ఐపీఎల్‌లో కొట్టింది తక్కువ స్కోరే.. అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. బలమైన లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై బౌలర్లు చెలరేగడంతో లక్నోను 108కే ఆలౌట్ చేసింది. దాంతో, ఐదో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. 20వ ఓవర్లో లక్నో విజయానికి 23 రన్స్ కావాలి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, లక్నో 108 రన్స్‌కు ఆలౌటయ్యింది. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది.
Victory in Lucknow for @RCBTweets!
A remarkable bowling performance from #RCB as they bounce back in style 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/HBDia6KEaX
— IndianPremierLeague (@IPL) May 1, 2023
స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow) తొలి ఓవర్లోనే షాక్. ఇన్నింగ్స్ రెండో బంతికే సిరాజ్ డేంజరస్ కైల్ మేయర్స్(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(14)ను మ్యాక్స్‌వెల్ పెవిలియన్ పంపాడు. హేజిల్‌వుడ్ ఓవర్లో కోహ్లీ (Kohli) అద్భుత క్యాచ్‌తో ఆయూష్ బదోని(4) ఔటయ్యాడు. ఆ తర్వాత లక్నో వికెట్ల పతనం మొదలైంది. పూరన్(9), స్టోయినిస్(13) త్వరగానే పెవిలియన్ చేరారు. కృష్ణప్ప గౌతమ్(23) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆఖర్లో అమిత్ మిశ్రా(19), నవీల్ ఉల్ హక్(13) పోరాడారు. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు స్పిన్ ఉచ్చులో పడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ల ధాటికి ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కొట్టలేకపోయారు. కెప్టెన్ డూప్లెసిస్(44), విరాట్ కోహ్లీ(31) మాత్రమే రాణించారు. దినేశ్ కార్తిక్(16), అనుజ్ రావత్(9), మ్యాక్స్‌వెల్(4) విఫలయ్యారు. దాంతో,ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్‌కు ఒక వికెట్ దక్కింది.