Lalit Modi: నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్

ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు.

Lalit Modi: నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్
Lalit Modi Calls Sushmita Sen Better Half

ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు. దీనిపై లలిత్ మోదీ స్పందించారు. మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి, ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండని పలు ఫోటోలతో కూడిన ట్వీట్లను చేశారు.

ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్‌ ట్రంప్‌ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండని మండిపడ్డారు. తన భార్య మినాల్‌ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్‌ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దన్నారు.

తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్‌ మోదీ.. తాను డైమండ్‌స్పూన్‌తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

(The above story first appeared on LatestLY on Jul 18, 2022 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).