Latest ICC T20I Rankings: లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్‌ బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్

ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు.

Latest ICC T20I Rankings: లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్‌  బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal World Record

ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు.

ఇక టాప్-2గా భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అయితే ఇంగ్లండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక స్థానం ఎగబాకి సూర్యతో సమానమైన పాయింట్లతో (797) మూడవ స్థానంలో నిలిచాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొత్తం 844 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జులై 26 నుంచి శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ర్యాంకులు మారే అవకాశం ఉంటుంది. ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

ఇక బౌలర్ల విషయానికి వస్తే, ఐసీసీ టీ20 బౌలర్ ర్యాంకుల్లో ఒక్క భారత బౌలర్‌కూ  చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వీరు ముగ్గురూ జింబాబ్వే టూర్‌లో ఆడకపోవడంతో పాయింట్లను కోల్పోయారు. గతంలో నాలుగవ స్థానంలో నిలిచిన కుల్దీప్ ఇప్పుడు 15వ స్థానానికి దిగజారాడు. ఇక గత అప్‌డేట్‌లో 7, 5 స్థానాల్లో నిలిచిన పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్ ఇప్పుడు వరుసగా 21, 23 స్థానాలకు పడిపోయారు. ఇక ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో గతంలో 9వ స్థానంలో నిలిచిన అక్షర్ పటేల్ ఇప్పుడు 15వ స్థానానికి పడిపోయాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ T20I బౌలర్లలో No.1 స్థానంలో కొనసాగుతున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 17, 2024 09:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).