Rishabh Pant: రూ. 27 కోట్లతో ఐపీఎల్ వేలం రికార్డులన్నీ బద్దలు కొట్టిన రిషబ్ పంత్, IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ వికెట్ కీపర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు బద్ధలైంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు బద్ధలైంది. పంత్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2024లో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు ధర పలికి అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.ఆ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో రూ.25 కోట్ల మార్కు దాటిన మొదటి ఆటగాడిగా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు.ఆ తర్వాత కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ రికార్డును రిషబ్ పంత్ బద్ధలు కొట్టాడు. కాగా, ఈసారి వేలంలో మిచెల్ స్టార్క్ ధర ఘోరంగా పడిపోయింది. గత ఐపీఎల్‌లో రూ.24.75 కోట్ల ధర పలికిన స్టార్క్ ఈసారి 11.75 కోట్లకు అమ్ముడు పోయాడు.
(The above story first appeared on LatestLY on Nov 24, 2024 07:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

