IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం
Sunrisers Hyderabad (Twitter/IPL)

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టుకు శుభారంభాన్నివ్వగా.. టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రైజర్స్‌ను భయపెట్టాడు. ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో ముంబైని గెలిపించినంత పనిచేసిన డేవిడ్‌ రనౌట్‌ కావడంతో హైదరాబాద్‌ ఊపిరి పీల్చుకుంది. మన బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. త్రిపాఠికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం కోల్‌కతాతో లక్నో తలపడనుంది.

(The above story first appeared on LatestLY on May 18, 2022 12:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).