PAK vs IND: వైరల్ వీడియో.. దేశభక్తి అంటే ఇదేనా.. జాతీయ జెండా ఇస్తుంటే వద్దంటూ పక్కకు నెట్టేసిన అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాపై మండిపడుతున్న నెటిజన్లు

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు.

PAK vs IND: వైరల్ వీడియో.. దేశభక్తి అంటే ఇదేనా.. జాతీయ జెండా ఇస్తుంటే వద్దంటూ పక్కకు నెట్టేసిన అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాపై మండిపడుతున్న నెటిజన్లు
Jay Shah Refused to Hold Indian National Flag

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. టీమిండియా విజయం అనంతరం జై షా తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం లేచి.. చప్పట్లు కొడుతున్న జై షాకు.. ఆయన పక్కనే ఉన్న ఒక వ్యక్తి.. జాతీయ జెండాను పట్టుకోమ్మని.. ఇచ్చాడు.

కానీ జై షా మాత్రం.. జాతీయ జెండాను పక్కకు నెట్టేశారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీలు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అమిత్‌ షా దేశ భక్తి అంటూంటే జై షా మాత్రం జాతీయ జెండానే పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.

చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 29, 2022 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).