Rohit Sharma: టీ-20ల్లో అత్యంత అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌, అప్ఘ‌నిస్తాన్ తో మ్యాచ్ లో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు సొంతం

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లోనే రోహిత్ మ‌రో అందుకున్నాడు. మెన్స్ క్రికెట్‌లో (Mens Cricket) అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 విజ‌యాలు అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మొహాలీ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Rohit Sharma: టీ-20ల్లో అత్యంత అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌, అప్ఘ‌నిస్తాన్ తో మ్యాచ్ లో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు సొంతం
Rohit Sharma (Photo Credits: Twitter)

Indore, JAN 14: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 మ్యాచులు ఆడిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు (Rohit Sharma Scripts History) ఎక్కాడు. ఇండోర్ వేదిక‌గా ఆదివారం అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 మ్యాచ్ ద్వారా రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. భార‌త్ కు చెందిన వారిలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు (Virat Kohli) మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (Cricket) వంద‌కు పైగా టీ20 మ్యాచులు ఆడారు. విరాట్ కోహ్లీ నేటి మ్యాచుతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 116 మ్యాచులు ఆడాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచు ద్వారా రోహిత్ శ‌ర్మ టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డి కెరీర్‌లో 31.07 స‌గ‌టుతో 3853 ప‌రుగులు చేశాడు. 29 హాఫ్ సెంచ‌రీలు, నాలుగు సెంచ‌రీలు అత‌డి పేరు మీద ఉన్నాయి.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు వీరే..

రోహిత్‌ శర్మ (భార‌త్‌) – 150 మ్యాచులు

పాల్‌ స్టిర్లింగ్ (ఐర్లాండ్‌) – 134

జార్జ్‌ డాక్రెల్ (ఐర్లాండ్‌) – 128

షోయబ్‌ మాలిక్ (పాకిస్తాన్‌) – 124

మార్టిన్‌ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 122

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 116

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లోనే రోహిత్ మ‌రో అందుకున్నాడు. మెన్స్ క్రికెట్‌లో (Mens Cricket) అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 విజ‌యాలు అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మొహాలీ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో అత్య‌ధిక మ్యాచులు గెలిచింది వీరే..

రోహిత్ శ‌ర్మ – 100* మ్యాచులు

షోయ‌బ్ మాలిక్ – 86

విరాట్ కోహ్లీ – 73

మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 70

మ‌హ్మ‌ద్ న‌బీ – 70

(The above story first appeared on LatestLY on Jan 14, 2024 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).