ICC T20I Batters' Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌, రెండవ స్థానంలోకి దూసుకువచ్చిన తిలక్ వర్మ, 25 ర్యాంక్‌లు ఎగబాకి టాప్‌-5లో చోటు సంపాదించిన వరుణ్‌ చక్రవర్తి

టీమిండియా యువ సంచలనాలు తిలక్‌ వర్మ, వరుణ్‌ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చారు. బ్యాటర్ల జాబితాలో తిలక్‌ వర్మ.. ఒక ర్యాంక్‌ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్‌.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్‌-5లో చోటు సంపాదించాడు.

ICC T20I Batters' Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌, రెండవ స్థానంలోకి దూసుకువచ్చిన తిలక్ వర్మ, 25 ర్యాంక్‌లు ఎగబాకి టాప్‌-5లో చోటు సంపాదించిన వరుణ్‌ చక్రవర్తి
Tilak Varma celebrates after scoring his maiden T20I century. (Photo credits: X/@yogesh_xrma)

టీమిండియా యువ సంచలనాలు తిలక్‌ వర్మ, వరుణ్‌ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చారు. బ్యాటర్ల జాబితాలో తిలక్‌ వర్మ.. ఒక ర్యాంక్‌ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్‌.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్‌-5లో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో జోరుమీదున్న తిలక్‌ చెన్నై మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ 72 పరుగులతో రాణించడంతో అతడి ర్యాంకింగ్‌ మెరుగైంది.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ (855 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా తిలక్‌ (832) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.వరుణ్‌.. ర్యాంకింగ్స్‌లో భారీగా మెరుగయ్యాడు. 679 పాయింట్లతో అతడు ఐదో స్థానంలో నిలవగా రషీద్‌ టాప్‌ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని చూడగానే కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలతో ఊగిపోయిన అభిమానులు

ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి మూడోదీ గెలిచి సిరీస్‌ను పట్టేయాలన్న టీమ్‌ఇండియా ఆశలపై పర్యాటక జట్టు నీళ్లు చల్లింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ను 26 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. 20 ఓవర్లకు 171/9 స్కోరు చేసింది. ఇక భారత్ 20 ఓవర్లలో 145/9 పరుగులకే పరిమితమైంది.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 171/9 (డకెట్‌ 51, లివింగ్‌స్టొన్‌ 43, వరుణ్‌ 5/24, హార్దిక్‌ 2/33);

భారత్‌: 20 ఓవర్లలో 145/9 (హార్దిక్‌ 40, అభిషేక్‌ 24, ఓవర్టన్‌ 3/24, కార్స్‌ 2/28)

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 12:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).