IPL 2023: వీడియో ఇదిగో, ధోని గురించి డైలాగులతో దుమ్మురేపిన బాలయ్య, 15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు అంటూ.. ప్రత్యేక ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు
స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ రోజు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలో..15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు
స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ రోజు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలో..15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు.
ఆ నెం.7 జెర్సీతో మనం కనెక్ట్ అయినప్పుడు జట్టులోకే కాదు నేరుగా మన గుండెల్లోకే ప్రవేశించాడు. అతడి టాలెంట్ వల్ల బెస్టాఫ్ ద బెస్ట్ కూడా అతడిని ఓడించలేకపోయింది. అతడు వికెట్ల వెనుక... మనం టీవీ సెట్ల ముందు... అలా ఆటను నడిపించాడు. కొందరికి మహి... కొందరికి కెప్టెన్ కూల్. ఆ తర్వాత 'తాలా' అయ్యాడు.
Here's Video
ᴛʜᴀʟᴀ - ᴛʜᴇ ɴᴀᴍᴇ ɪꜱ ᴇɴᴏᴜɢʜ! 😍
పెను తుఫాను తలొంచి చూసే, తొలి నిప్పు కణం అతడే! 🔥
అతనే మన కెప్టెన్ కూల్ ఎం.ఎస్.ధోని. 💪🏻😎#Forever7 💛
👀 CSKvLSG | ఈరోజు 6.30 PM
మీ 📺 #StarSportsTelugu/HD & #StarMaaMovies లో 🔥#IPLOnStar #TATAIPL2023 #HusharuOn #GameOn pic.twitter.com/XNftxCd8vF
— StarSportsTelugu (@StarSportsTel) April 3, 2023
గెలిపించిన వాడు, ఏడ్పించిన వాడు, నవ్వించిన వాడు... కానీ ఓటమిని అంగీకరించడం మాత్రం నేర్పలేదు.. మనమే కాదు, ప్రత్యర్థులు కూడా అభిమానించే ఆటగాడు.... ఇవీ ఆయన గురించి కొన్ని అద్భుత క్షణాలు! ఇలాంటి అద్భుత క్షణాలను లెక్కలేనన్ని అందించినందుకు ధన్యవాదాలు తాలా... ఎల్లప్పుడూ 7" అంటూ బాలయ్య తనదైన శైలిలో ప్రోమోను రక్తి కట్టించారు.
(The above story first appeared on LatestLY on Apr 03, 2023 07:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

