Kohli Breaks Rohit Sharma Record: రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు
- Read in
- తెలుగు
సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 2101 పరుగులున్నాయి. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌ల్లో 2097 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 57 ఇన్నింగ్స్‌ల్లో 2101 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ పేరు మీద ఉంది. రూట్ 3,987 పరుగులు చేశాడు. 3,641 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో, 3,223 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.
Here's News
Virat Kohli Surpasses Rohit Sharma To Take No. 1 Spot In Elite WTC List For Indian Batters#INDvsSAhttps://t.co/mwoB5TDcHb
— CricketNDTV (@CricketNDTV) December 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 27, 2023 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

