Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

ఈ ఏడాది జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన తుది జట్టుని ఎంపిక చేశాడు.

Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు
Virender Sehwag

ఈ ఏడాది జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన తుది జట్టుని ఎంపిక చేశాడు.ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అంతగా రాణించలేకపోతుండడంతో అతడిని సెహ్వాగ్ పక్కనపెట్టాడు.

బలమైన జట్టు ఆడాలనుకుంటే తుది జట్టులో పాండ్యాకు చోటివ్వకూడదని అన్నాడు. అయితే 15 మంది సభ్యులలో ఒకడిగా ఎంపిక చేయవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌’లో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ మేరకు తన అంచనా జట్టుని వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్ ఆరంభించాలని అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3, 4 స్థానాల్లో బ్యాటింగ్ చేయాలన్నాడు. ఇక వికెట్ కీపర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఇక యువ సంచలనాలు రింకూ సింగ్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చని పేర్కొన్నాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పేర్లు, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మలను సెహ్వాగ్ ఎంచుకున్నాడు.

సెహ్వాగ్ తుది జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే/రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.

(The above story first appeared on LatestLY on Apr 26, 2024 02:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).