IPL 2023: వీడియో ఇదిగో, సిరాజ్ డైరక్ట్ త్రో దెబ్బకి షాకయిన హర్‌ప్రీత్‌, పెద్దగా అరుస్తూ కోహ్లీ సెలబ్రేట్,బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన హైదరాబాదీ ఆటగాడు

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ పంజాబ్‌ బ్యాటర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ బాటియాను రనౌట్‌ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

IPL 2023: వీడియో ఇదిగో, సిరాజ్ డైరక్ట్ త్రో దెబ్బకి షాకయిన హర్‌ప్రీత్‌, పెద్దగా అరుస్తూ కోహ్లీ సెలబ్రేట్,బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన హైదరాబాదీ ఆటగాడు
Mohammed Siraj (Image Credits - Twitter/@RCBTweets)

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ పంజాబ్‌ బ్యాటర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ బాటియాను రనౌట్‌ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో విజయ్‌కుమార్‌ వేసిన మూడో బంతిని ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ మిడాఫ్‌ దిశగా ఆడాడు. సింగిల్‌ తీసే ప్రయత్నం చేసిన ప్రబ్‌సిమ్రన్‌ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న హర్‌ప్రీత్‌ బాటియాకు కాల్‌ ఇచ్చాడు.

నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్ల భరతం పట్టిన సిరాజ్, 24 పరుగుల తేడాతో PBKSపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ

ప్రబ్‌సిమ్రన్‌ పిలుపుతో హర్‌ప్రీత్‌ పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్‌ డైరెక్ట్‌ త్రో విసిరాడు. హర్‌ప్రీత్‌ క్రీజులోకి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. డైరెక్ట్‌ త్రోతో స్టన్నింగ్‌ రనౌట్‌ చేసిన సిరాజ్‌ రొనాల్డో ఫేమస్‌ 'Sui' సెలబ్రేషన్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

మ్యాచ్‌ మొత్తంలో హైలెట్‌గా నిలిచింది మాత్రం హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడమే గాక డైరెక్ట్‌ హిట్‌తో పంజాబ్‌ బ్యాటర్‌ను రనౌట్‌ చేయడం విశేషం. ఒక రకంగా సిరాజ్‌ ఐదు వికెట్ల ఫీట్‌(నాలుగు వికెట్లు+ రనౌట్‌) సాధించినట్లే. ఇక పంజాబ్‌పై నాలుగు వికెట్ల ప్రదర్శన సిరాజ్‌కు ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ అని చెప్పొచ్చు.

(The above story first appeared on LatestLY on Apr 21, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).