World Cup 2023: విరాట్ కోహ్లీకి 5 బంతులే ఎక్కువ, పసికూన నెదర్లాండ్స్ బౌలర్ వార్నింగ్, నీకు అంత సీన్ లేదంటున్న విరాట్ అభిమానులు
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కి నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి విదితమే.మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది.
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కి నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి విదితమే.మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.అంతకంటే ముందు ఆస్ట్రేలియా, భారత్‌తో వార్మాప్ మ్యాచ్‌లు ఆడనుంది
ఇక వచ్చీ రాగానే డచ్ స్టార్ ఆల్‌రౌండర్ లోగాన్ వాన్ బీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్‌చేసేందుకు ఇప్పటికే నేను ప్లాన్లు వేసేసుకున్నామని చెప్పాడు. తను కేవలం 5 బంతుల్లోనే కోహ్లిని ఔట్ చేస్తానని థీమా వ్యక్తం చేశాడు.నేను విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసేటప్పుడు మొదటి రెండు బంతులను ఔట్‌స్వింగర్లగా సంధిస్తాను. ఆ తర్వాత బంతని ఆఫ్ కట్టర్ స్లోయర్ బాల్ వేస్తాను. అప్పుడు విరాట్ పోర్ కొడతాడని నాకు తెలుసు. దీంతో చికాకు పడినట్లు నటిస్తా.
ఒక ఐదు నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా. కెప్టెన్‌ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లు ఇద్దరం నటిస్తాము. ఏదో ఒక వైపు చెయ్యి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు యాక్ట్‌చేస్తాను. కానీ నేను ఆ దిశగా బౌలింగ్ చేయను. అతడిని నేను మోసం చేస్తాను. నాలుగో బంతిని హాఫ్ సైడ్‌గా వేస్తాను. అది కూడా అతడు బౌండరీకి పంపిస్తాడు. భారత అభిమానులు ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిస్తారు.
కోహ్లిలో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాకు కూడా కావల్సింది అదే. ఈ సమయంలో ఐదో బంతిని వేసేముందు పైకి ఒక్కసారి చూస్తా. ఈ క్షణం నన్ను ఏం అడిగినా చేస్తా జస్ట్ కోహ్లి వికెట్ ప్రసాదించు స్వామీ అని క్రికెట్ దేవుళ్లను కోరుకుంటా. కళ్లు మూసుకొని వచ్చి వేస్తా ఆ బంతికి కోహ్లి అవుటైపోతాడు' అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోగాన్ వాన్ పేర్కొన్నాడు.
(The above story first appeared on LatestLY on Sep 29, 2023 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

