Team India (Photo-Twitter)

ICC World Cup 2023 India Final Squad Announcement Live Updates:  ICC ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియా యొక్క తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ గురువారం అక్షర్ పటేల్ స్థానంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన అక్షర్ పటేల్ ప్రపంచ కప్ నుండి వైదొలిగాడు.తొలుత ప్రకటించిన ప్రొవిజనల్‌ జట్టులోని సభ్యుడు అక్షర్‌ పటేల్‌ ఆసియా కప్‌-2023 సందర్భంగా గాయం బారిన పడి, పూర్తిగా కోలుకోలేని కారణంగా వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తప్పించబడ్డాడు.

అక్షర్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా, ముందుగా ప్రకటించిన జట్టే యధాథంగా కొనసాగించబడింది. జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్‌ 28) ఆఖరి తేదీ కావడంతో భారత సెలక్టర్లు హుటాహుటిన మార్పు విషయాన్ని అనౌన్స్‌ చేశారు. ప్రపంచకప్‌ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు.

ప్రపంచకప్ కోసం భారత జట్టులో కీలక మార్పు, గాయంతో దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌

ప్రస్తుతం ఆఫ్ స్పిన్నర్ లేని భారత బౌలింగ్ లైనప్‌కు 37 ఏళ్ల అతను చాలా కీలకంగా మారాడు.ఆసీస్‌తో సిరీస్‌కు అశ్విన్‌‌ భారత జట్టులోకి వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు).. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్‌కు అశ్విన్‌ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి.

అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 14న భారత్‌.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్‌ 30న ఇంగ్లండ్‌తో.. అక్టోబర్‌ 3న నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన తలపడుతుంది.

హైదరాబాద్‌ చేరుకున్న పాక్‌ టీమ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం, ఉప్పల్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న పాక్‌ టీమ్

ICC ప్రపంచ కప్ 2023 కోసం భారత తుది జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌