AP Horror: నదిలో విసిరేస్తే.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో అరగంట అలాగే వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక.. 'శభాష్ కీర్తన' అంటూ నెట్టింట్లో ప్రశంసలు.. అసలేం జరిగింది??

మీరు చదువుతున్న ఈ వార్త వింటే, మీ కాళ్ల కింద భూమి కంపించవచ్చు. ఎంతటి ధైర్యస్థులైనా.. 13 ఏండ్ల ఈ బాలిక చూపించిన తెగువ, సమయస్ఫూర్తికి శభాష్ అనకుండా ఉండలేరు.

AP Horror: నదిలో విసిరేస్తే..  చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో అరగంట అలాగే వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక.. 'శభాష్ కీర్తన' అంటూ నెట్టింట్లో ప్రశంసలు.. అసలేం జరిగింది??
Credits: Twitter

Vijayawada, Aug 7: మీరు చదువుతున్న ఈ వార్త వింటే, మీ కాళ్ల కింద భూమి కంపించవచ్చు. ఎంతటి ధైర్యస్థులైనా.. 13 ఏండ్ల ఈ బాలిక చూపించిన తెగువ, సమయస్ఫూర్తికి శభాష్ అనకుండా ఉండలేరు. అసలేం జరిగిందంటే..  గుంటూరు (Guntur) జిల్లా తాడేపల్లికి చెందిన సుహాసిని (Suhasini) భర్తతో విభేదాలతో విడిపోయింది. కుమార్తె కీర్తనతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సురేశ్‌ అనే వ్యక్తితో  ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. వీరికి ఏడాది వయసున్న జెర్సీ జన్మించింది. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో సురేష్ వీళ్లందరినీ వదిలించుకోవాలని పథకం రచించాడు.

Rajasthan Horror: తాగినమైకంలో వృద్ధుడి ఘాతుకం.. 'నేను పరమశివుణ్ణి.. నిన్ను చంపి మళ్లీ బతికిస్తా’ అంటూ వృద్ధురాలి హత్య.. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..

బట్టలు కొందామని నమ్మించి

కొత్త బట్టలు కొందామని నమ్మించి శనివారం సాయంత్రం కారులో ముగ్గురినీ తీసుకుని రాజమహేంద్రవరం  బయలుదేరాడు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని వారిని నమ్మించి కిందికి దింపాడు. ఆపై రెయిలింగ్ వద్దకు తీసుకెళ్లి అందరినీ ఒక్కసారిగా కిందికి తోసేశాడు. సుహాసిని, జెర్సీ నదిలో పడిపోగా కీర్తనకు మాత్రం బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపు చేతికి చిక్కింది. చేతులతో దానిని గట్టిగా పట్టుకుంది.  ఈ క్రమంలో తన జేబులో సెల్‌ఫోన్ ఉన్న విషయం గుర్తొంచింది. ఒక చేత్తో పైపును గట్టిగా పట్టుకుని మరో చేత్తో దానిని తీసి పోలీస్ కంట్రోల్ రూము నంబరు 100కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేవరకూ దాదాపు అరగంటపాటు చిమ్మచీకట్లో పైపుకు వేలాడుతూ ఉంది. పాప చూపించిన తెగువ, సమయస్ఫూర్తి, ధైర్యానికి పోలీసులతో పాటు నెటిజన్లు శబాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిందితుడితో పాటు నదిలో పడిపోయిన సుహాసిని, జెర్సీ కోసం వెదుకుతున్నారు.

Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

(The above story first appeared on LatestLY on Aug 07, 2023 09:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).