Jaipur, Aug 7: రాజస్థాన్ (Rajasthan) లో ఘోరం జరిగింది. తాగిన మైకంలో ఓ వృద్ధుడు ఘోరానికి పాల్పడ్డాడు. తాను పరమశివుడినంటూ (Lord Shiva) ఊగిపోయిన అతడు ఓ వృద్ధురాలిని చంపి మళ్లీ బతికిస్తానంటూ దారుణానికి తెగబడ్డాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించి పొట్టనపెట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ప్రతాప్ సింగ్(70) అనే వృద్ధుడు ఇటీవల పూటుగా మద్యం తాగాడు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కల్కిబాయ్ గమేతి(85) అనే వృద్ధురాలిని (Old Women) పిలిచాడు. తాను శివుడిని అంటూ ఊగిపోయి ఆమె వారిస్తున్నా.. వినకుండా మహిళ ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. దెబ్బలకు తాళలేక ఆమె వద్దని అరుస్తున్నా.. ఏం పర్లేదు మళ్లీ బతికిస్తా అంటూ మరింతగా రెచ్చిపోయాడు.
India Today: Drunk man thrashes woman to death in Rajasthan, claims to be Lord Shiva's avatar.https://t.co/7cQOOuXG7ehttps://t.co/kdU3ijGrvb
via @GoogleNews
— Farzana Latif (@Farzana27373285) August 6, 2023
గొడుగుతో చావచితక కొట్టాడు
కింద పడిపోయిన బాధితురాలిని గొడుగుతో చావచితక కొట్టాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఘటన సమయంలో అక్కడ ప్రతాప్ సింగ్ తో పాటూ ఇద్దరు మైనర్లు, నాథూసింగ్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారిలో ఒకరు ఈ దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.