Andhra Pradesh Leaves: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ లో 20 సాధారణ సెలవులు.. సాధారణ లీవ్స్‌ తోపాటు 17 ఐచ్చిక సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ లో పండుగలు, జాతీయ సెలవులు కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh Leaves: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ లో 20 సాధారణ సెలవులు.. సాధారణ లీవ్స్‌ తోపాటు 17 ఐచ్చిక సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!
AP Government logo (Photo-Wikimedia Commons)

Vijayawada, Dec 1: ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) లో పండుగలు (Festivals), జాతీయ సెలవులు (National Holidays) కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవులకు తోడు మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు ఉంటాయని పేర్కొంది. సాధారణ సెలవుల్లో సంక్రాంతి మొదలుకొని క్రిస్మస్ వరకు పండగల తేదీలను ప్రకటించింది.

తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి

సెలవులు-తేదీలు ఇవే..

  1. మకర సంక్రాంతి - జనవరి 15
  2. కనుమ -జనవరి 16
  3. రిపబ్లిక్ డే - జనవరి 26
  4. మహాశివరాత్రి - మార్చి 8
  5. హోలి - మార్చి 25
  6. గుడ్ ఫ్రైడే - మార్చి 29
  7. బాబూ జగ్జీవన్ రావు జయంతి - ఏప్రిల్ 5
  8. ఉగాది - ఏప్రిల్ 9
  9. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) - ఏప్రిల్ 11
  10. శ్రీరామ నవమి ఏప్రిల్ - 17
  11. బక్రీద్ - జూన్ 17
  12. మొహర్రం - జులై 17
  13. స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
  14. శ్రీ కృష్ణాష్టమి - ఆగస్టు 26
  15. వినాయక చవితి - సెప్టెంబర్ 7
  16. మిలాద్ ఉన్ నబీ - సెప్టెంబర్ 16
  17. మహాత్మ గాంధీ జయంతి - అక్టోబర్ 2
  18. దుర్గాష్టమి - అక్టోబర్ 11
  19. దీపావళి - అక్టోబర్ 31
  20. క్రిస్మస్ - డిసెంబర్ 25

తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి

(The above story first appeared on LatestLY on Dec 01, 2023 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).