Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ (Telangana Assembly Election 2023) ముగిసింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.
13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో (13 constitutions) సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. 4 గంటల వరకు వరుసలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. అయితే, సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అధికారులు అనుమతించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad) పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు.