Guntur Shocker ఇంత కామంతో ఉన్నారా.. 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి, కేకలు వేస్తున్నా నోరుమూసి ఆపై దాడి చేసి పరార్, మరోచోట కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ సవతి తండ్రి
Image used for representational purpose | (Photo Credits: File Image)

Guntur, April 18: గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా (Guntur district) కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన వృద్ధురాలు 15 సంవత్సరాల క్రితం కూలీ పనుల నిమిత్తం వచ్చి కామాక్షి నగర్‌లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు.

ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తెలకు వివాహం కావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఒంటరిగా ఆ ముసలావిడ నివశిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్లు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని తలుపులు తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి (80-year-old woman was allegedly raped) పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత స్పృహలోకి వచ్చిన సీతమ్మ స్థానికులకు విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

ఇక విజయనగరం జిల్లా డెంకాడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక సవతి తండ్రి అర్థరాత్రి దాటిన తర్వాత సవతి కూతురిపై అత్యాచారానికి (Step Father sexually Assaults Daughter) పాల్పడుతూ వచ్చాడు. ఈ దారునం నెలల పాటు సాగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంకాడా జోన్‌కు (Denkada Shocker) చెందిన 12 ఏళ్ల బాలిక ఏడవ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి తన సవతి తండ్రి అత్యాచారానికి (sexually Assaults) పాల్పడుతూ వచ్చాడు. కాగా ఇటీవలికాలంలో భార్య, భర్తల మధ్య తగాదా రావడంతో బాలికను తీసుకుని తల్లి విశాఖలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది.

అయితే భర్తతో తగాదా మంచిది కాదని సోదరుడు సర్దిచెప్పడంతో రెండురోజుల కిందటే తిరిగి ఆ మహిళ తన కూతురును తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లి లేని సమయంలో బాలికపై ఆ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కాగా ఈ దారుణంపై ఆ బాలిక తన తల్లితో కూడాపెదవి విప్పలేకపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ బాలిక విశాఖ వెళ్లినప్పుడు పక్కింటి పిన్నితో తన గోడునంతా వెళ్లబోసుకుంది. అప్పుడు ఆమె కూడా ఏం చేయలేకపోయింది. అయితే మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కూడా సవతి తండ్రి అత్యాచారం చేయడంతో బాలిక ఏడుస్తూ ఫోన్‌లో తన పిన్నికి విషయం చెప్పింది.

ఆమె వెంటనే స్పందించిన ఆమె ఆ బాలిక తల్లికి విషయాన్ని వివరించడంతో ఆమె తల్లి వెంటనే ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.