Agra Shcoker: ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు నపుంసకులు ఓ వ్యక్తి పురుషాంగాన్ని ( Two Eunuchs Chop Off Genitals) నరికివేసి పరారరయిన ఘటన Delhi Gate police station పరిధిలో చోటు చేసుకుంది.

Agra Shcoker: ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Agra, April 12: ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు నపుంసకులు ఓ వ్యక్తి పురుషాంగాన్ని ( Two Eunuchs Chop Off Genitals) నరికివేసి పరారరయిన ఘటన Delhi Gate police station పరిధిలో చోటు చేసుకుంది. ఆగ్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల యువకుడు గుడి, రాజీ అనబడే ఇద్దరు నపుంసకులతో కలిసి తిరిగే వాడు. వారితో స్నేహం చేస్తూ వచ్చాడు. వారితో కలిసి అప్పుడప్పుడూ వివాహ కార్యక్రమాలలో నృత్యం చేసేవాడు. ఇలా కొంత కాలం నడిచింది.

రోజు లాగే రెండు రోజుల క్రితం అతను ఆ నపుంసకులతో (Two Eunuchs) కలిసి వెళ్లాడు. అయితే అక్కడ ఆ యువకునికి, ఇద్దరు నంపుసకులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా పెద్దదిగా మారడంతొ ఇద్దరూ అతనిపై తిరగబడ్డారు. అతని పురుషాంగాన్ని కోసి వేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర రక్త స్రావం కావడంలో బాధిత యువకుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన సోదరికి తెలిపాడు. వెంటనే అతని సోదరి అక్కడకు చేరుకుని ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

నా భర్త సెక్స్‌ చేస్తుంటే భరించలేని నొప్పితో ఏడుపొచ్చేది, నాకు ఉన్న రెండు యోనిలే కారణం..ఈ విషయం 25 ఏళ్ల వరకు నర్సు చెప్పే దాకా నాకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా యువతి బ్రిటనీ జాకోబ్స్ వీడియో

ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) మాట్లాడుతూ.. నిందితులపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 326 (స్వచ్ఛందంగా తీవ్ర గాయాలు కలిగించేది) కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.కాగా పోలీసులు విచారణ కోసం చాలా మందిని ప్రశ్నంచారు. అయితే ఇంతవరకు ఎటువంటి అరెస్టు నమోదు కాలేదు. బాధితుడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

(The above story first appeared on LatestLY on Apr 12, 2021 11:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).