Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా, ఈనెల 8 వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ముగిసిన బీఏసీ సమావేశం
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) నేతృత్వంలో బీఏసీ (BAC Meeting) సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) నేతృత్వంలో బీఏసీ (BAC Meeting) సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ (TDP) బాయ్‌కాట్ చేసింది. అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (Minister Buggana Rajendranathh Reddy) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌తో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) సమావేశమయ్యారు.
ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగం హైలెట్స్ ఇవే..
ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది
రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్
9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం
రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు
పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం
ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత
పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి
ఎల్‌ఏ అండ్ ఆర్ ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి
జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది
జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం
నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం
2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం
రూ. 71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు
దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం
2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్ అందిస్తున్నాం
నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ. 1961 కోట్లకు పెరిగింది
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు
వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ
వైఎస్సార్ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం
ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం
3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ
వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ
మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి
రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి
పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు
అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం
వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం
78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం
రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు
2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్
రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ఇం డియాగా ఏపీ
మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం
మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ
చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం
చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం
ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం
రైతులు రాష్ట్రానికి వెన్నుమక
62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు
10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం
రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం
22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం
మిచాంగ్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం
నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు
53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి
1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాం
ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన
8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశాం
వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం
ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం
విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు
అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు
ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం
ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయి
ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్
సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?
పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం
ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం
జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం
జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం
విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది
మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది
సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది
విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం
నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి
నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు
పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం
మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం
విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం
(The above story first appeared on LatestLY on Feb 05, 2024 12:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

