AP Cabinet Key Decisions: ఏపీలో ముందస్తు, జమిలి ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన అని తెలిపిన ముఖ్యమంత్రి
సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు.
Vjy, Sep 20:సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు. సీఎం జగన్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.దీనిలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్ కళాశాలలో గిరిజనులకు 50 శాతం సీట్లిచ్చే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేలా చూడాలని భేటీలో సీఎం జగన్ కోరారు. మొత్తం 49 అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఇవిగో..
►విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన
►అప్పటివరకూ కార్యాలయాలను తరలించాలని నిర్ణయం
►విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం
►కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు
►ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతాం
►ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
►ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం
►జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం.
►కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
►ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.
►ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
►ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది.
►ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుంది.
►కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం
►పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.
►అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం
►భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
►దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
(The above story first appeared on LatestLY on Sep 20, 2023 01:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

