AP High Court

Vjy, Sep 18: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం గం.12. నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు జరిగాయి. ఈ కేసులో ఇరు పక్షాల తరఫున మొత్తం ఐదుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.ఇక న్యాయస్థానం రెండు రోజుల్లో తీర్పు వెల్లడించనున్నట్టు సమాచారం.

తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే లంచ్ బ్రేక్ వరకు వాదనలు వినిపించారు. ఆ తర్వాత రెండున్నర గంటల తర్వాత నుంచి సాయంత్రం ఐదు వరకు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సీఐడీ తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, సీఐడీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తోందని వాదనలు వినిపించారు.

నేను మీ బిడ్డను, సీమ నీటి కష్టాలు నాకు తెలుసు, లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి, డోన్‌ సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

సీఐడీ తరఫున ముకుల్ రోహాత్గీ లండన్ నుంచి వర్చువల్ పద్ధతిలో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, రెండున్నరేళ్ల పాటు పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తూ.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? లేదా? డబ్బులు పోయాయని ఒకవైపు సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూపకపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించింది.

ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన

అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రధానంగా షెల్‌ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు. ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఎ వర్తించదని వాదించారు.

కార్పొరేషన్‌ సంబంధించి న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అన్ని వాదనలు ఈరోజే పూర్తిచేయాలని ఒక దశలో బెంచ్‌ అనడంతో కౌంటర్‌ వాదనలు ఈరోజే వినిపించడంతో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దీంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నందున అటు ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లపైనా విచారణ వాయిదా పడింది. పిటిషన్లపై విచారణను ఈ నెల 21కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ దృష్ట్యా విచారణ వాయిదా పడింది.

ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్‌

► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023

► ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్

► 121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్

► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు

► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు

► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్