
Guntur, Feb 18: ఏపీలో నెల్లూరు డీఐజీ కిరణ్ (DIG of Stamps & Registration) వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి ఈ భర్త (DIG Kiran) వేధిస్తున్నారు. కొంతకాలంగా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు .దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి వివరాల ప్రకారం.. గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్ పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్‌ఐసీ శాఖలో అసిస్టెంట్‌లుగా పని చేశారు. 1998 డిసెంబర్‌లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. అయితే వీరికి సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలుడిని దత్తత తీసుకున్నారు.
అనంతరం 2009లో కిరణ్‌కుమార్‌కు విజయనగరంలోని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లాడు. ఆ తరువాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది.ఆ సమయంలో కిరణ్ అడ్డదారి తొక్కారు. వేరే మహిళళతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
Guntur Stamps & Registrations DIG Kiran Illegal Affairs
గుంటూరులో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ పై కేసు
పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు
ప్రశ్నించిన భార్యను చితకబాదిన భర్త కిరణ్
భర్త దాడిలో భార్యకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
CC @PawanKalyan 😎 pic.twitter.com/rWFrl70RAe
— Rahul (@2024YCP) February 18, 2025
దీంతో ఆమె భర్త నుంచి దూరంగా జరిగింది. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా భర్త కిరణ్ కుమార్ రాత పూర్వకంగా రాసిచ్చాడు. తాజాగా అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్ బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు.
అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు కిరణ్ కుమార్ వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.