CM Jagan Review on AP Bifurcation Act: విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం, 13వ షెడ్యూల్‌ ప్రకారం మన నిధులు మనకు రావాల్సిందే, విభజన చట్టంపై సీఎం జగన్ సమీక్ష హైలెట్స్ ఇవిగో..

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేపు(మంగళవారం) కేంద్ర హెంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అధి​కారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM Jagan Review on AP Bifurcation Act: విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం, 13వ షెడ్యూల్‌ ప్రకారం మన నిధులు మనకు రావాల్సిందే, విభజన చట్టంపై సీఎం జగన్ సమీక్ష హైలెట్స్ ఇవిగో..
CM YS Jagan (Photo-AP CMO Twitter)

Vjy, Nov 20: రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేపు(మంగళవారం) కేంద్ర హెంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అధి​కారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లయినా విభజన చట్టంలోని అంశాలు అమలుకు నోచుకోలేదని సీఎం జగన్ అన్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగిందని, విభజన చట్టంలోని హామీల అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బాధితులకు బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, ప్రమాదానికి కారణాలు ఏంటంటే..

ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటివరకు ఇవ్వలేదని, పోలవరం నిధుల హామీ నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇంకా రాలేదని అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేపు రాష్ట్ర విభజన అంశాలపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో విభజన హామీలు, 13వ షెడ్యూల్ లోని సంస్థలు, తదితర అంశాలపై చర్చించన్నారు. ఈ కీలక సమావేశం నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో నేడు సమీక్ష సమావేశం చేశారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.

రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది:

విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి

ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు

కాని రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది

పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి

తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు కూడా రాలేదు

మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది

పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి

విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు

హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం

దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం

దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది

విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది

ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి

తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి

రెవిన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది

రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది

అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది

అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం

ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత

మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది

ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి

భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది

ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం

దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి

కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీని కోరుతున్నాం

కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి

దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది

వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది

స్టీల్‌ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి

దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది

విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్టీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది

విశాఖపట్నం – వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి

దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి

విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలి

వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు

విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది

దీంతో ఎయిర్‌ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది

ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌ పోర్టును నిర్మిస్తున్నారు

ఈ ఎయిర్‌ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం

మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది

విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

భోగాపురం ఎయిర్‌ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది

విజయవాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది

విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలన్న సీఎం

ప్రైవేట్‌ డెవలపర్‌ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం

రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది

దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి

వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి

(The above story first appeared on LatestLY on Nov 20, 2023 08:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).