CM Chandrababu on Amaravati: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అమరావతిని నాశనం చేశారని వైసీపీపై మండిపాటు

అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకు వచ్చిన సీట్లకు సరిపోలుతోంది.

CM Chandrababu on Amaravati: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అమరావతిని నాశనం చేశారని వైసీపీపై మండిపాటు
Chandrababu (photo-Video Grab)

Amaravati, June 20: అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకు వచ్చిన సీట్లకు సరిపోలుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాం. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) అన్నారు.

శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగా సెంట్రల్‌లో అమరావతిని ఏర్పాటు చేశాం. అయినా రాజధానిపైన బురదజల్లే ప్రయత్నం చేశారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని ఆరోపించారు. విషం చిమ్మి సింగపూర్‌ కన్సార్టియంను తరిమేశారు. ఇక్కడి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే వారిపై ఎన్నో అపవాదులు వేశారు. ఆడారు. అయిదేళ్ల తర్వాత మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి వ్యక్తులకు ఓటేసిన వారు ఆలోచించుకోవాలి. అమరావతి, పోలవరం మాకేం సంబంధం అనుకోవద్దు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలని అన్నారు.  రుషికొండ ప్యాలెస్‌‌పై ముదురుతున్న వివాదం, ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడారంటే..

కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలి. 70-80 దేశాల్లో తెలుగు ప్రజలు అమరావతిని నాశనం చేయడంపై నిరసన తెలిపారు. రౌడీయిజం రాజకీయాల్లో లేకుండా చేస్తాం. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. రుషులు తపస్సులు చేసిన ప్రాంతం రుషికొండను నాశనం చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. లెక్కలు చూపించి.. చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తీసుకొచ్చారు. హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజావేదికను జగన్‌ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతాం.గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు. లేకుంటే ఊరుకున్నారు. జగన్‌లా చేయలేదు.’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో గత వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు.

పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసింది. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందన్నారు. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కేంద్ర నిధులతో పోలవరం కట్టి, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

(The above story first appeared on LatestLY on Jun 20, 2024 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).