Rushikonda Palace in Visakhapatnam: విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ మీద ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని , 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని , రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!
అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ తిప్పి కొడుతోంది. రుషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి, దానిని ఇంకా జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రుషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు.
Here's Rushikonda Palace Videos
#WATCH | Andhra Pradesh: Drone visuals of the buildings constructed atop Rushikonda in Visakhapatnam.
Rushikonda Palace controversy erupted when Bheemili MLA Ganta Srinivasa Rao visited the buildings constructed atop Rushikonda by the previous YSRC regime. Terming the buildings… pic.twitter.com/XcjVQ68kAo
— ANI (@ANI) June 20, 2024
View this post on Instagram
నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, లేదంటే ఇతర ముఖ్యులు వస్తే ప్రైవేటు హోటళ్లలోనో, మరెక్కడో ఉంచాల్సిన పరిస్థితి వస్తోందని, ఇప్పుడు రుషికొండ భవనాలను వారి ఆతిథ్యానికి వాడుకోవచ్చని వివరించారు.
Here's TDP tweet
దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు అత్యంత విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్ గురించే చర్చ నడుస్తోంది. ఎవరి అనుమతితో రూ.500 కోట్ల ప్రజల సొమ్ముతో జగన్ ఈ ప్యాలెస్ ను కట్టించాడు? దీని మీద లోతైన దర్యాప్తు జరిగి తీరాల్సిందే అంటున్నారు ఏపీ ప్రజలు.#FurnitureDongaJagan #AndhraPradesh pic.twitter.com/Fq8E71u19c
— Telugu Desam Party (@JaiTDP) June 17, 2024
రుషికొండ భవనాలపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొడాలి నాని మండిపడ్డారు.. జగన్ సొంత భవనాల్లో మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ భవనాల్లో ఉండరన్నారు. జగన్‌కు ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ లేదన్నారు. రుషికొండ భవనాల్లో జగన్ ఉంటారు అని ఎవరు చెప్పారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించారని చెప్పారు.
YSRCP Counter
రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాల్ని.. @ysjagan గారి నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం వైయస్ జగన్ గారికి లేదు. సొంత ఇంటిలోనే ఉంటారు
-కొడాలి నాని, మాజీ మంత్రి pic.twitter.com/ggdsYaXHlw
— YSR Congress Party (@YSRCParty) June 20, 2024
రాష్ట్ర ప్రజలను ఏమార్చేటటువంటి ప్రయత్నాలు నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాం
రాబోయే రోజుల్లో గవర్నర్, రాష్ట్రపతి, ఇతర పెద్దలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో చూడడం మానేసి ఇంకా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఇళ్లులా చిత్రీకరించడం సమంజసం కాదు.
-గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి pic.twitter.com/AO7YlzEDJO
— YSR Congress Party (@YSRCParty) June 17, 2024
అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వారి కోసం మాత్రమే వీటిని నిర్మించారన్నారు. కోడెల అసెంబ్లీలో ఉండే ఫర్నీచర్‌ను బైక్ షోరూమ్ లో పెడితే దొంగ అన్నారని.. ఫర్నీచర్ ఎంత వ్యయం అని చెబితే చెల్లిస్తారు, లేకపోతే తీసుకు వెళ్లిపోండని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సూపర్ సిక్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే నియోజకవర్గాలలో పర్యటన ఉంటుందని కొడాలి నాని వెల్లడించారు.
Here's Videos
#WATCH | Andhra Pradesh: Drone visuals of the buildings constructed atop Rushikonda in Visakhapatnam.
Rushikonda Palace controversy erupted when Bheemili MLA Ganta Srinivasa Rao visited the buildings constructed atop Rushikonda by the previous YSRC regime. Terming the… pic.twitter.com/yu8DMpOf74
— ANI (@ANI) June 20, 2024
Drone visuals of the trending Rushikonda Palace (Raja Mahal), Visakhapatnam 🙏 pic.twitter.com/qezQdvj16c
— వై.ఎస్.కాంత్ (@yskanth) June 20, 2024
రుషికొండ భవనాల వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. పర్యాటక స్థలంలో పర్యాటకశాఖ భవనాలు నిర్మించడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. వర్షానికి లీకయ్యే అసెంబ్లీ, సచివాలయం కట్టినవాళ్లు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 2021లోనే కేంద్ర అటవీపర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి రుషికొండలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. 61 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టాం. అందులో అక్రమం ఎక్కడుంది. ప్రతి దశలోనూ హైకోర్టుకు నివేదిక సమర్పించాం జగన్ సొంత భవనాలు అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్లు..అవి ప్రభుత్వ భవనాలని ఇప్పటికైనా అంగీకరిస్తారా.. లేదా ?” అంటూ రోజా ట్వీట్ చేశారు.
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.
పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి రోజా సెల్వమణి చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. గతంలో సీఎం ఉండటానికి నివాసం అని.. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారని చెప్పి.. నేడు పర్యాటకుల కోసం నిర్మించామని మాట్లాడుతున్నారని అన్నారు. రోజాను విచారిస్తే అసలు నిజాలు ఏంటో, నాడు చెప్పిన త్రిసభ్య కమిటీ కథ ఏంటో మొత్తం బయటకు వస్తుందని అన్నారు.రుషికొండ భవనాలు రాష్ట్రపతి కోసమని కాసేపు.. రాష్ట్ర ప్రభుత్వానికి అని కాసేపు చెబుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అసలు రుషికొండను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారని మాజీ మంత్రి రోజాను ప్రశ్నించారు. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లుగా మీ కబుర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో సోకులు చేసుకునేందుకు సిద్ధమైన మీకు ఆ ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు.
విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya Swamy) స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమన్నారు.