CM Jagan Paris Tour: పారిస్ బయలుదేరిన ఏపీ సీఎం జగన్, కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, జూలై 3న తిరిగి ఏపీకి రానున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిస్‌కు (CM Jagan Paris Tour) బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్‌ చేరుకుంటారు.

CM Jagan Paris Tour: పారిస్ బయలుదేరిన ఏపీ సీఎం జగన్, కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, జూలై 3న తిరిగి ఏపీకి రానున్న సీఎం
AP-CM-Ys-Jagan-and-his-wife-Bharathi (Photo-Twitter)

Amaravati, June 28: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిస్‌కు (CM Jagan Paris Tour) బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్‌ చేరుకుంటారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి పారిస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

పారిస్‌‌లోని Insead Business Schoolలో హర్ష రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. జులై 2న జరిగే కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు ( CM Jagan couple to Leave paris) పాల్గొంటారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్‌లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ముందా.. చంద్రబాబుకు నిద్ర కూడా రావడం లేదు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు

తన కుమార్తె స్నాత‌కోత్సవానికి (daughter Graduation Ceremony) హాజరయ్యేందుకు పారిస్‌ వెళ్లడానికి అనుమ‌తి ఇవ్వాలని సీఎం జగన్ కొద్దిరోజుల కింద సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతును సడలించాలని కోర్టును కోరారు. ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.జగన్‌ పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, ఆయన విదేశాలకు వెళ్తే కేసుల విచారణ ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, కొత్తగా మరో 3 లక్షల 98 మందికి ఫించన్లు, లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతో పాటు ఫించను కార్డు

అనేక కారణాల వల్ల విదేశాలకు వెళుతున్నారని.. అది విచారణపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే సీబీఐ అధికారుల వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటనకు వెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయితే పారిస్ పర్యటన వివరాలను సీబీఐ అధికారులతో పాటు కోర్టుకు కూడా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Jun 28, 2022 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).