Kodali Nani and Perni Nani (Photo-File Image)

Gudivada, June 28: కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో (YSRCP Plenary 2022) పాల్గొన్న మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని తెలిపారు. కొడాలి నాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. నేను సీఎంని అవుతా.. సీఎం జగన్‌ను దించేస్తా అనే స్థాయి నుంచి.. ఇవాళ నానిని ఓడిస్తా అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు.

కానీ, ఇప్పుడు గుడివాడకు కొడాలి నాని ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌. కొడాలి నానిని ఓడించడం (Kodali Nani Trouble Maker For TDP ) తర్వాత సంగతి.. ముందు పోటీకి ఎవరైనా అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి. కొడాలి నానికి భయపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. బాబే కాదు.. ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరు. పేదలకు ఇచ్చిన ఇంటిని నారా లోకేష్‌ బాత్‌రూమ్‌తో పోలుస్తున్నాడు. అక్రమ సంపాదనతో పెద్ద బాత్రూం కట్టించుకున్నావ్‌ కాబట్టే అలా మాట్లాడుతున్నావ్‌. పేదల సొంతింటి కల నెరవేర్చిన.. గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్ని నాని ( Perni Nani) ప్రసంగించారు.

అమ్మఒడి డబ్బులు అకౌంట్లోకి వచ్చేశాయి, రూ. 6,595 కోట్లను తల్లుల అకౌంట్లలోకి జమ చేసిన ఏపీ ప్రభుత్వం, చదువే నిజమైన ఆస్తి అని తెలిపిన సీఎం జగన్

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిందని.. మరో పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పారాయన. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా.. కొడాలి నానిని ఓడించలేరని పేర్కొన్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..పనికిమాలిన 420లు అంతా అ‍మ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్స్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారు అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ నిర్వహణకోసం రూ.2 వేలు తీసుకుంటున్నాం. 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి అందించాం. చంద్రబాబుకి సిగ్గూ శరం లేదు.

లక్ష దాటని మెజార్టీ, ఆత్మకూరు ఉప ఎన్నికలో 82,888 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ విజయం, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

చంద్రబాబు నీ జీవితంలో రూ.18 లక్షలైనా ఖర్చు చేశావా. రామోజీరావు, బీఆర్ నాయుడు, దత్తపుత్రుడికి కళ్లు కనిపించడం లేదా?. చంద్రబాబు 14 ఏళ్లలో ఏడాదికి ఒకటి మెడికల్‌ కాలేజీ చొప్పున కట్టినా జిల్లాకొకటి ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.20 వేల కోట్లు పిల్లలకు ఖర్చు చేస్తుంటే.. దీన్నే మంటారు మీ పిండాకూడా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మంచి చేస్తుంటే ఈ 420లు అంతా కలిసి వెనుక గోతులు తవ్వుతున్నారు. సామాజిక న్యాయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్ పర్సన్‌ వచ్చుండేదా. టీడీపీ ఏనాడూ సీఎం జగన్ ప్రభుత్వం మాదిరి సంక్షేమాన్ని అందించలేదు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది . డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?. చంద్రబాబు చవట దద్దమ్మ. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాం. నీ సొంత కుమారుడిని మంగళగిరిలో ఓడించాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం. 2024లో నేను మళ్ళీ గెలుస్తాను అని కొడాలి నాని అన్నారు.

ఎన్టీఆర్ మా ఆస్తి.. మాకోసం పార్టీ పెట్టిన దేవుడు ఎన్టీఆర్. నువ్వెవడివిరా.. చంద్రబాబు. అన్నగారికి వెన్నుపోటు పొడిచి.. పార్టీలాక్కున్న నీచుడు, 420 చంద్రబాబు. చంద్రబాబును, ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా. చంద్రబాబు, రామోజీరావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడేవాడు. వైఎస్ వారసుడిగా మనకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. చావైనా.. బ్రతుకైనా జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.