Andhra Pradesh Elections 2024: రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యిందంటూ ఉండవల్లి శ్రీదేవి సంచలన ట్వీట్, వారిని ఉద్దేశించి పెట్టిందా అంటూ చర్చలు

రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ తాడికొండ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది. బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేయడంతో ఇంకా ఆసక్తికరంగా మారింది.

Andhra Pradesh Elections 2024: రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యిందంటూ ఉండవల్లి శ్రీదేవి సంచలన ట్వీట్, వారిని ఉద్దేశించి పెట్టిందా అంటూ చర్చలు
Tadikonda MLA Undavalli Sridevi Intersting Tweet on AP Politics (photo-X)

టీడీపీ మూడో జాబితా నేడు ప్రకటించిన అనంతరం, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ తాడికొండ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది. బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేయడంతో ఇంకా ఆసక్తికరంగా మారింది. వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..

ఉండవల్లి శ్రీదేవి ఈ పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆమె చేసిన ట్వీట్ ప్రధాన ప్రతిపక్షం గురించే అని అర్థమవుతోంది. ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున శాసనసభ్యురాలిగా గెలిచారు. అయితే, వైసీపీలో ఇతర నేతలతో సఖ్యత చెడడంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా... ఈసారి ఎన్నికల్లో తిరువూరు (ఎస్సీ రిజర్వ్ డ్) అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు.నేడు టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల ఎంపీ స్థానానికి తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్ ను తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు.

Here's Her tweet

ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అటు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

(The above story first appeared on LatestLY on Mar 22, 2024 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).