Andhra Pradesh Elections 2024: ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం

ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం
TDP Alliance Releasing Manifesto

Vjy, April 30: ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..అనే నినాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశామని అన్నారు. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతామని అన్నారు. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది.టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం. ప్రజలను గెలిపించేందుకే మా కలయిక. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నామని తెలిపారు.

మేనిఫెస్టో లో కీలక అంశాలు

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.

ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.

యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.

ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.

‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.

రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.

ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.

ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.

ఇసుక ఉచితం.

భూ హక్కు చట్టం రద్దు.

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం.

బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

వృద్ధ్యాప్య పింఛను నెలకు రూ.4వేలు, పెంచిన పింఛను ఏప్రిల్‌ నుంచి అమలు.

బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛను.

రాజధానిగా అమరావతి కొనసాగింపు.

కలలకు రెక్కలు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు.

ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ.

ఎన్డీయే తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు.

చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు.

బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు.

ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి. సరైన పరిష్కార మార్గం సూచిస్తాం.

ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.

వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.

కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం.

ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు.

అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తాం.

పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం.

ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం.

దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం.

గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు.

వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు.

స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌.

మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన 217 జీవో రద్దు.

ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

(The above story first appeared on LatestLY on Apr 30, 2024 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).