Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు
Election Commission (File Photo)

తెలుగు రాష్ట్రాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు , అలాగే 25 ఎంపి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో 175 స్థానాలకు 4,210 నామినేషన్లు, 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు రాగా, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో పార్టీలు బీఫామ్‌లు దక్కించుకున్న నేతలతో పాటు.. రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ మే 13వ తేదీ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన హోంశాఖ, మే 1న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు

ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేసిన ప‌లువురు అభ్యర్థులను ఈసీ ఆమోదించలేదు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.అసెంబ్లీ స్థానాల‌కు తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది.