Andhra Pradesh Elections 2024: ఎర్రకండువాతో ఓటేయడానికి వచ్చిన ఓటరు, తీవ్ర అభ్యంతరం తెలిపిన వంగా గీత, నాగబాబు దీనిపై ఏమన్నారంటే..
ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు.
ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతడు మెడలో ఎర్ర కండువా వేసుకుని రావడంతో జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో ఎన్నికల అధికారులు అతడిని అక్కడ్నించి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..
దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.ఎర్ర తువ్వాలును కాశీ తువ్వాలు అంటారని వెల్లడించారు. ఆ తువ్వాలను కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చని తెలిపారు. ఆ తువ్వాలును వేసుకునే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుందని" నాగబాబు స్పష్టం చేశారు.
Here's Video
అధికార అహంకారం తగ్గించుకోవాలి వంగా గీత గారూ. ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా... దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి? అంతలా కండువా భయపెడుతుందా @YSRCParty వారిని? @ECISVEEP , @CEOAndhra… pic.twitter.com/9Vb1iMiygy
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 13, 2024
(The above story first appeared on LatestLY on May 13, 2024 04:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

