Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Vjy, August 9: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు. భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం
ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Aug 09, 2024 02:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

