Deputy Collectors Transferred in AP: ఏపీలో 11మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్, గవర్నర్ తొలి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ (Deputy Collectors Transferred) చేస్తూ సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్‌ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్‌డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు.

Deputy Collectors Transferred in AP: ఏపీలో 11మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్, గవర్నర్ తొలి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, August 21: ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ (Deputy Collectors Transferred) చేస్తూ సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్‌ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్‌డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్‌ కోసం కె.ఎస్‌ రామరావును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్‌ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ(ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడీసీఎస్‌వీ మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా బదిలీ అయిన నేపధ్యంలో గవర్నర్ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట కర్ఫ్యూ పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 1,435 కోవిడ్ కేసులు, 6 మరణాలు నమోదు మరియు 1,695 మంది రికవరీ

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ముఖేష్ కుమార్ మీనా విశ్వసనీయమైన, సమర్ధవంతమైన అధికారి అని, రాజ్ భవన్ వ్యవస్ధను తీర్చిదిద్దటంలో మంచి పనితీరును చూపారని, రోజువారీ కార్యాలయ వ్యవహారాలలో సైతం ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం తనకు కలగలేదని అన్నారు. నూతన శాఖ విషయంలోనూ మీనాపై ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన భాధ్యతలను ఉంచిందని, అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని హరిచందన్ అన్నారు.

అదే క్రమంలో వ్యక్తిగత భద్రత, అధికారిక కార్యక్రమాలతో సహా విభిన్న అంశాలను మాధవ రెడ్డి చాలా జాగ్రత్తగా నిర్వహించారని గవర్నర్ ప్రస్తుతించారు. మీనా, మాధవ రెడ్డిలు రాజ్‌భవన్‌ను వీడుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పగించిన అతి ముఖ్యమైన పనుల నిర్వహణకు వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని తన కుటుంబ సభ్యులు గానే తాను భావిస్తానని, వారిలో ఎవరికి ఏ సమయంలో ఆపద ఎదురైనా తగిన స్పందన కనబరచాలని తాను ఉన్నతాధికారులను ఆదేశిస్తూ ఉంటానని గవర్నర్ అన్నారు.

(The above story first appeared on LatestLY on Aug 21, 2021 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).