Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం

పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.

Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం
Drown Representative Image

విజయవాడ, జనవరి 31: పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.

పల్నాడు జిల్లా నూజెండ్లకు చెందిన జి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వృత్తిరీత్యా వ్యాపారి అయిన తన తండ్రిని కారులో కాల్వ వద్దకు తీసుకెళ్లి కాల్వలో (Elderly man dies after being thrown into canal by son) పడేశాడు. స్థానికులు గమనించి వృద్ధుడిని రక్షించే సమయానికి మృతి చెందాడు. తండ్రిని చూసుకోలేక వెంకటేశ్వరరావు కాల్వలో పడేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం

వారు తెలిపిన వివరాల ప్రకారం... నూజండ్లకు చెందిన (Bhadrupalem village of Ipuru mandal of Palnadu district) గంగినేని కొండయ్య(85) తనకున్న పొలం అమ్మేసి, ఆ డబ్బును పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకు ఇచ్చేశాడు. కుమారుడు వెంకటేశ్వరరావుకు గ్రామంలో పాలు, శీతల పానీయాలు, సిమెంట్‌ దుకాణాలు ఉన్నాయి. మూడేళ్లుగా భార్య శిరోమణితో కలిసి కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఆయన భార్య శిరోమణి కొద్దికాలం క్రితం చనిపోయింది. తండ్రి వృద్ధాప్యంలో ఉండటంతో కొడుకు కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వృద్ధుడైన తండ్రిని మాయమాటలు చెప్పి నమ్మించి కారులో సాగర్‌ కాల్వ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయనను వెనక నుంచి కాలువలో తోసేశాడు. అయితే ఇదంతా దూరం నుంచి చూసిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ లోపే వృద్ధుడి నీటిలో మునిగి మృతి చెందాడు. అక్కడి నుంచి కొడుకు వెంకటేశ్వరరావు కారెక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు.

గ్రామస్థులు అతడ్ని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. వృద్ధుడిని ఎందుకు కాల్వలో పడేశావని నిలదీస్తే తన తన భార్య పోరు పడలేక ఇలా చేసినట్లు చెప్పాడు. ఆపై గ్రామస్థులు అతడిని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఉమామహేశ్వరరావు కొండయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 06:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).