Andhra Pradesh Horror: కన్నతల్లి దారుణం, ఇద్దరి కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపిన కసాయి, పిల్లల కోసం మాతృత్వానికి మచ్చతెచ్చేలా నిర్ణయం

ఏపీలోని ఏలూరు జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి మాతృత్వానికి మచ్చతెచ్చేలా కన్న కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపింది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Andhra Pradesh Horror: కన్నతల్లి దారుణం, ఇద్దరి కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపిన కసాయి, పిల్లల కోసం మాతృత్వానికి మచ్చతెచ్చేలా నిర్ణయం
mother handed over Two Daughters to her second husband for pregnancy (Photo-Twitter)

Eluru, July 14: ఏపీలోని ఏలూరు జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి మాతృత్వానికి మచ్చతెచ్చేలా కన్న కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపింది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఆమె కు.ని. శస్త్రచికిత్స చేయించుకుంది. తర్వాత మేనత్త కొడుకును రెండోపెళ్లి చేసుకుంది.

అయితే తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని రెండవ భర్త ఆమెను బెదిరించేవాడు.ఇదిలా ఉండగా ఆమె కూతుర్లు ఇద్దరూ యుక్తవయసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఆమె ఒప్పించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

వీడియో ఇదిగో, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదాడు

తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెను భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలతో.. కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పడంతో.. అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదుచేశారు.

(The above story first appeared on LatestLY on Jul 14, 2023 01:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).