Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు గ్యాంగ్ రేప్, లైంగిక బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకున్న సంగతి విదితమే. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగికదాడికి (Vijayawada rape victim) పాల్పడ్డారు.
Amaravati, April 22: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకున్న సంగతి విదితమే. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగికదాడికి (Vijayawada rape victim) పాల్పడ్డారు.
విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ( orders for full-length probe) ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం ( ex-gratia of Rs. 10 lakh) వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్‌ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించారంటూ సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సీపీ సస్పెండ్ చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనలో ముందుగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం వహించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వచ్చినప్పటికీ సాయంత్రం రమ్మని పోలీసులు చెప్పడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. డీజీపీ కార్యాలయం ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకున్న అనంతరం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వచ్చిన ఇద్దరు పోలీస్ అధికారులు సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ సీపీకి ఆదేశాలు జారీ చేశారు.
(The above story first appeared on LatestLY on Apr 22, 2022 02:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

