New Delhi, April 22: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పట్టపగలే మహిళను రోడ్డుపై వెంబడించి మరీ హత్యకు(Woman Chased, Stabbed To Death) పాల్పడ్డాడు. సౌత్ వెస్ట్ ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే (Front Of Her Children) కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా వెళుతుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది.
ఆ దుండగుడు కూడా ఆమె వైపు వేగంగా వచ్చి తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు.. మృతురాలు ఇంతకముందు ఇరుగుపొరుగువారని తేలిందని, ఆమె ఇప్పుడు వేరే ఇంటికి నివాసం మార్చినట్లు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని ఢిల్లీ పోలీసులు తేలిపారు.