Sri City, April 22: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటును ప్రారంభించింది. ఎలక్ట్రికల్ ఉత్పత్తుల విభాగంలో సంస్థకు దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది. రెండు దశలకుగాను మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఇప్పటికే రూ.300 కోట్లు వ్యయం చేశారు. వైరింగ్ డివైసెస్ అయిన రోమా, పెంటా మాడ్యులర్, రోమా అర్బన్ బ్రాండ్ల ఉత్పత్తులు తొలుత ఇక్కడ తయారు చేస్తారు. రానున్న రోజుల్లో స్విచ్‌గేర్స్, వైర్స్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఉత్పత్తులను రూపొందిస్తారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్‌ను గురువారం ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన సంగతి విదితమే.