CM Jagan Mohan Reddy Inaugurates Rs 1500-crore ATG tyre unit in Atchutapuram (Photo-Video Grab)

Atchutapuram, August 16: అచ్యుతాపురంలో ఏటీజీ టైర్స్ కంపెనీని సీఎం జగన్ ( CM Jagan Mohan Reddy) ప్రారంభించారు. జపాన్‌కు చెందిన యోకహామా గ్రూప్‌కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల (Rs 1500-crore ATG tyre unit ) అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా లెదర్ యూనిట్‌ను సిద్ధం చేసి సుమారు 2,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించారు. వ్యవసాయం, మైనింగ్‌లో ఉపయోగించే వాహనాల కోసం కంపెనీ టైర్లను తయారు చేస్తుంది. మరో రూ.1000 కోట్లు వెచ్చించి మరో 1000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప‌రిశ్ర‌మ విస్తరణకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉందని, 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారంతో సెకండ్‌ ఫేజ్‌కు ముందుకొచ్చారని, ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలని సీఎం అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

వివిధ జైళ్ల నుంచి 162 మంది ఖైదీలు విడుదల, 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలతో పాటు మూతపడ్డ ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నామని జగన్ అన్నారు. ఎంఎస్‌ఎమ్‌ఈల పునరుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని, రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని సీఎం తెలిపారు.రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయి.అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు,

గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు.. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని.. 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అనే విషయాన్ని వేదిక సాక్షిగా ప్రకటించారు సీఎం జగన్‌.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని ATG సీఈవో నితిన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లాంట్‌గా యూనిట్‌ను తయారు చేస్తామని సీఈవో నితిన్‌ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.