Vijayawada Shocker: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది
VJY, Mar 3: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
విజయవాడ పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడుగా పని చేస్తున్నాడు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ (35) శాంతినగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తోంది. పలుమార్లు ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసిన సుభాష్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో ఆమె నంబరు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు.
వాటిని ఆమెకు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా రూ. 16 లక్షల నగదు తీసుకున్నాడు. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెపై దాడిచేశాడు. ఇటీవల అతడి ఆగడాలు మితిమీరడంతో కుటుంబ సభ్యులతో కలిసి సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

