AP Shocker: ఏపీలో దారుణం, ఆ భాగంలో రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, శ్మశానంలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడది అర్థరాత్రి కాదు కదా.. పగలు కూడా బయట తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన (AP Shocker) చోటు చేసుకుంది. బహిర్భూమికని బయటకు వెళ్లిన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి (Minor girl raped) పాల్పడ్డాడు.
Palakonda, Jan 3: ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడది అర్థరాత్రి కాదు కదా.. పగలు కూడా బయట తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన (AP Shocker) చోటు చేసుకుంది. బహిర్భూమికని బయటకు వెళ్లిన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి (Minor girl raped) పాల్పడ్డాడు. డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని (Vizianagaram district) పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బహిర్భూమికని బయటకు వెళ్లింది.
చీకటి సమయం కావడంతో ఆ బాలిక ప్రకృతి కోసం వెళ్లగా.. సమీపంలో మాటు వేసిన అదే గ్రామానికి చెందిన గౌరునాయుడు (48) అనే వ్యక్తి చిన్నారిని బలవంతంగా సమీపంలోని శ్మశానం వైపు ఎత్తుకెళ్లాడు. కేకలు వేయకుండా నోరు మూసేశాడు. పక్కనే ఉన్న శ్మశాన వాటికవైపు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అటుగా వచ్చిన స్థానికులు అలికిడి విని వెళ్లి చూడగా నిందితుడు పరారయ్యాడు. పక్క గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని బంధించి దేహశుద్ధి చేశారు.
బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గౌరు నాయుడుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 03, 2023 05:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

