Gwalior, Jan 2: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మాయలో పడి కన్నతల్లినే కడతేర్చింది ఓ కసాయి కూతురు. ప్రియుడితో కలిసి ఆమెను కత్తితో దారుణంగా పొడిచి (17-year-old girl kills mother) చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆదివారం జరిగింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నిందితురాలు మైనర్(17). ఆమె బాయ్‌ఫ్రెండ్ (boyfriend) వయసు 25 ఏళ్లు. ఈ ఇద్దరినీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
కాగా నిందితులిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అమ్మాయి తల్లి వీరిద్దరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని కలవొద్దని కూతురుకు వార్నింగ్ ఇచ్చింది. అయితే అవేమి పట్టించుకోని కూతురు రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఆమె మైనర్ అయినందున తల్లిదండ్రులు కేసు కూడాపెట్టారు.
దీంతో పోలీసులు ప్రియుడ్ని అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలై మళ్లీ అమ్మాయిని తరచూ కలుస్తున్నాడు. దీంతో మళ్లీ తల్లి హెచ్చరించింది.ఈ నేపథ్యంలోనే తన ప్రేమకు తల్లే అడ్డుపడుతోందని భావించిన అమ్మాయి ఆమెపై కక్ష పెంచుకుంది. పథకం పన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది.